ఆంజనేయుడికి ఒక సీటు..ఆదిపురుష్ ఐడియా అదుర్స్
adipurush movie team humble tribute to lord hanuman. theaters allot one seat to hanuma
X
భారతీయ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు...ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్నపేరు ఆదిపురుష్. ఈ సినిమా విడుదల కోసం పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్లుగా దర్శకుడు ఓం రౌత్ వందల కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్ సినిమాను రూపొందించారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. హిందీలో తొలిసారిగా ప్రభాస్ ఆదిపురుష్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కాబోతోంది. దీంతో ఆదిపురుష్ టీం ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్‌కి వస్తున్న బజ్ చూస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు పక్కా అన్న టాక్ భారీగా వినిపిస్తోంది. తిరుపతిలో జరిగే ప్రీ రిలీజ్‌ను కూడా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఆదిపురుష్ టీమ్.
ఇదిలా ఉంటే ఇవన్నీ ఒకఎత్తైతే...లేటెస్టుగా ఆదిపురుష్ మేకర్స్ మరో థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఆంజనేయ స్వామి అంటే అందరికి ఎంతో నమ్మకం అది స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పనిలో అయినా భయం అనేది దరి చేరకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలనుకునే వారు ఏ పని చేయడానికి అయినా.. యుందుగా ఆంజనేయ శ్లోకం చదువుతుంటారు. ఆ నమ్మకంతోనే సినిమా విజవంతం కావాలని ఆదిపురుష్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రదర్శించి ప్రతి థియేటర్లో ఒక సీట్‌ను హనుమంతునికి కేటాయిస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. సినీ హిస్టరీలో ఎప్పుడు జరుగని విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు మేకర్స్. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్ ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక చూద్దాం అంటూ తెలిపారు.
నిజానికి రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు వస్తాడు అనేది హిందువుల నమ్మకం. ఆ నమ్మకాన్ని గౌరవిస్తూనే ఆదిపురుష్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి సినిమా హాల్లో థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా ఆంజనేయుని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరిని ఆకట్టుకుంటోంది. అభిమానుల గుండెలను భక్తి భావంతో నింపేశారు మేకర్స్. మూవీరిలీజ్, థియేటర్స్ గురించిన వివరాలకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ఓ లెటర్ ని షేర్ చేశారు. ఇప్పుడు ఆ లెటర్ భారతీయ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రతి థియేటర్లోను హనుమంతుడికి సీటు అంటూ తమకు తెలియకుండానే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.