Home > సినిమా > సిద్ధార్థ్.. స్టేజిపై పట్టుకుని ఏడ్చిన ఆవిడ ఎవరంటే..?

సిద్ధార్థ్.. స్టేజిపై పట్టుకుని ఏడ్చిన ఆవిడ ఎవరంటే..?

సిద్ధార్థ్.. స్టేజిపై పట్టుకుని ఏడ్చిన ఆవిడ ఎవరంటే..?
X

సినీ ఇండస్ట్రీలో అనుకోకుండా హీరో అయినవాళ్లు కొందరు. కష్టపడి పైకొచ్చిన వాళ్లు మరొకరు. తెలిసిన వాళ్ల ప్రోత్సాహంతో ఎదిగిన వాళ్లు ఇంకొకరు. అలాంటి వాడే హీరో సిద్ధార్థ్. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. అనుకోకుండా హీరో అయ్యాడు. స్టార్ గా ఎదిగాడు. అలాంటి సిద్ధార్థ్.. తన టక్కర్ సినిమా ప్రమోషన్ లో స్టేజిపై కన్నీరు పెట్టుకున్నాడు. ఒకావిడను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆవిడే సుజాత రంగరాజన్. ఈవిడ లేకపోతే సిద్ధార్థ్ హీరో అయ్యేవాడు కాదు. తనని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈవిడే. టక్కర్ ప్రమోషన్స్ కు వచ్చిన సుజాత రంగరాజన్.. సిద్ధార్థ్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆమె స్టేజ్ వైపు రాగానే.. ఎదురువెళ్లిన సిద్ధార్థ్, తన కాళ్లపై పడి నమస్కరించాడు. తర్వాత ఆవిడను హత్తుకుని ఏడ్చాడు. ‘సుజాత.. నన్ను బాయ్స్ సినిమాకు హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ శంకర్ ను కోరకపోతే.. నా జీవితం వేరే లా ఉండేది’ అని సిద్ధార్థ్ చెప్పాడు.

‘సిద్ధార్థ్ దర్శకుడు కావాలనుకున్నాడు. నేనే బాయ్స్ సినిమా ఆడిషన్స్ జరుగుతుంటే.. శంకర్ ను సిద్ధార్థ్ ను హీరోగా ట్రై చేయమని కోరా. దానికి శంకర్ ఒప్పుకుని సిద్ధార్ధ్ ఫొటోస్ చూశాడు. ఆ తర్వాత హీరోగా ఓకే చేశార’ని సుజాత చెప్పారు. ఈ వీడియో చూసిన సిద్ధార్థ్ ఫ్యాన్స్ సుజాతను మెచ్చుకుంటున్నారు

Updated : 8 Jun 2023 10:58 PM IST
Tags:    
Next Story
Share it
Top