మల్టీప్లెక్స్లో 300 టికెట్లు బుక్ చేసిన కృతి.. ఎవరి కోసమో తెలుసా..!
Mic Tv Desk | 22 Jun 2023 5:05 PM IST
X
X
ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్ర పోషించిన కృతి సనన్.. నటనతో తనదైన ముద్ర వేసింది. ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోలేనంత బాగా నటి పూర్తి న్యాయం చేసింది. తాజాగా ఈ సినిమా కోసం కృతి ఢిల్లీ మల్టీప్లేక్స్ లో 300 టికెట్లు బుక్ చేసింది. తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల కోసం ఈ టికెట్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పిల్లలతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడనుంది.
కృతి అదే స్కూల్ లో చదువుకుందట. తన స్కూల్ అంటే అమితమైన ఇష్టం ఉన్న కృతి.. వాళ్లకోసం ఈ టికెట్స్ బుక్ చేసింది. అయితే, ఇటీవలే ఆ స్కూల్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కృతి.. ప్రత్యేక పోస్ట్ పెట్టి అభినందించింది. అంతేకాకుండా ఇదివరకు వరుణ్ ధావన్ తో కలిసి నటించిన భేడియా సినిమాను కూడా ఆ స్కూల్ లోనే ప్రమోట్ చేసింది,.
Updated : 22 Jun 2023 5:05 PM IST
Tags: tollywood news bollywood news latest released movies movie news cinema news entertainment news latest news telugu news adipurush kriti sanon kriti sanon book 300 tickets
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire