Home > సినిమా > రాములోరి గుడికి ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఉచితం..ఆ జిల్లాకే ప్రత్యేకం

రాములోరి గుడికి ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఉచితం..ఆ జిల్లాకే ప్రత్యేకం

రాములోరి గుడికి ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఉచితం..ఆ జిల్లాకే ప్రత్యేకం
X

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్‌ రాముడిగా, అందాల భామ కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా నటిస్తున్న రామాయణం ఆధారంగా..భారీ బడ్జెట్‎తో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న వివిధ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ మధ్యనే ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని హనుమంతుని కోసం కేటాయించాలని ఫిల్మ్ మేకర్స్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ మంచి ఉద్దేశంతో ప్రముఖ ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ కంపెనీ శ్రేయస్‌ మీడియా కూడా ప్రతి రామాలయానికి ఉచితంగా 101 ఆదిపురుష్ టికెట్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయినట్లు మీడియాకు తెలిపింది. ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో ఉన్న ప్రతి రామాలయానికి తమ సొంత సొమ్ముతో టికెట్లు కొని ఇవ్వనుంది. దీంతో ఆయా గ్రామాల్లో ఉన్న రాములవారి భక్తులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ పండుగ చేసుకుంటున్నారు.

Updated : 12 Jun 2023 9:30 AM IST
Tags:    
Next Story
Share it
Top