ఓటీటీలోకి 12th ఫెయిల్...స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
ఈ మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. అలాంటిదే 12th ఫెయిల్ మూవీ. విధు వినోద్ చోప్రా డైరెక్షన్ లో విక్రాంత్ మస్సే హీరోగా నటించిన ఈ చిత్రం చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకొని ఇంటర్నెషనల్ లెవల్ లో దుమ్ము లేపింది. గత ఏడాది అక్టోబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ హిందీ వర్షన్‌లో డిస్నీ + హాట్ స్టార్ లో ఓటీటీలోకి రిలీజ్ అయింది. కానీ ఇతర బాషలో చుద్దాం అనుకున్న వాళ్లకు నిరాశ ఎదురైంది. అయితే తాజాగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తెలుగు, తమిళ్ వర్షన్‌లో కూడా మూవీని రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఇవాల్టి నుంచి ‘12th ఫెయిల్’ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ యూత్ కి మంచి మేసెజ్ ఇచ్చింది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి లైఫ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ యువకుడు..ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో చిత్రం సాగుతుంది. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది.
అంతేగాక వరల్ట్ వైడ్ గా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి దాకా హిందీ వర్షన్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు..తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంకేందుకు మరి ఆలస్యం మీరు చూసేయండి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.