Home > సినిమా > Filmfare Awards 2024: యానిమల్ సినిమాకు అవార్డుల పంట.. సత్తా చాటిన 12th ఫెయిల్

Filmfare Awards 2024: యానిమల్ సినిమాకు అవార్డుల పంట.. సత్తా చాటిన 12th ఫెయిల్

Filmfare Awards 2024: యానిమల్ సినిమాకు అవార్డుల పంట.. సత్తా చాటిన 12th ఫెయిల్
X

బాలీవుడ్‌ ప్రతిష్టాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల జాబితా వచ్చేసింది. శనివారం (జనవరి 29) గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వేడుకలో విజేతలను ప్రకటించారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకలో.. గతేడాది ప్రేక్షకులను అలరించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల మనసు దోచుకున్న 12th ఫెయిల్ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. 12th ఫెయిల్ డైరెక్టర్ విధు వినోద్‌ చోప్రాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దక్కింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాకు ఈసారి అవార్డుల పంట పండింది. రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంట ఈసారి రికార్డ్ నెలకొల్పారు. ఉత్తమ నటుడిగా రణ్ బీర్, ఉత్తమ నటిగా అలియా అవార్డులు గెలుచుకున్నారు.





అవార్డుల జాబితా ఇదే..

➤ ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

➤ ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

➤ ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

➤ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌

➤ ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

➤ ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

➤ ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

➤ ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

➤ ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

➤ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

➤ ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

➤ ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌

➤ ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

➤ ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

➤ ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

➤ ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)








Updated : 29 Jan 2024 1:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top