ఓటీటీ యూజర్లకు బంపర్ ఆఫర్..ఈ వారం 21 సినిమాలు రిలీజ్
X
ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యేందకు సిద్ధమయ్యాయి. తెలుగుతో పాటు, పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొత్తం 21 నిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో ఓ రెండు సినిమాల కోసం మాత్రమే సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న కొత్త కంటెంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రో :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. మామ అల్లుడు కలిసి నటించిన చిత్రం ఓటీటీలోకి రానుండటంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. తమిళంలోని మూల కథను తీసుకుని పవన్ స్టార్ డమ్కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. అయినా కూడా కథ ఆకట్టుకుంది.
ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
బేబి :
ఇటీవల రిలీజై టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీ జులై 14న థియేటర్స్లోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. బేబీ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ఆహా.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు 12గంటల ముందుగానే ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచి వాళ్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్ :
ఆగస్టు 22 : లైట్ హౌస్ (జపనీస్ సిరీస్)
ఆగస్టు 24 : బకీ హమా సీజన్ 2 (జపనీస్ సిరీస్)
ఆగస్టు 24 : రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
ఆగస్టు 25 : కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా)
ఆగస్టు 25 : యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
ఆగస్టు 23 : ఆశోక (ఇంగ్లీష్ సిరీస్)
ఆగస్టు 25 : ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
ఆగస్టు 25 : ఆఖరి సచ్ (హిందీ సిరీస్)
జీ5 :
ఆగస్టు 25 : షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ మూవీ)
జియో సినిమా :
ఆగస్టు 21 : లఖన్ లీలా భార్గవ (హిందీ సిరీస్)
ఆగస్టు 25 : బజావో (హిందీ సిరీస్)
బుక్ మై షో
ఆగస్టు 21 : సమ్ వేర్ ఇన్ క్వీన్స్ (ఇంగ్లీష్ సినిమా)
హెచ్‌ఆర్ ఓటీటీ :
ఆగస్టు 22 : మధుర మనోహర మోహం (మలయాళ చిత్రం)
సైనా ప్లే :
ఆగస్టు 22 : పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ మూవీ)
ఆగస్టు 25 : ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ చిత్రం)
ఆపిల్ ప్లస్ టీవీ :
ఆగస్టు 23 : ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
ఆగస్టు 25 : వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే :
ఆగస్టు 25 : ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్ సినిమా)
మనోరమ మ్యాక్స్ :
ఆగస్టు 25 : కురుక్కన్ (మలయాళ చిత్రం)