OTT Release :ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే చిత్రాలు ఇవే...
X
ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యేందకు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో నాగశౌర్య రంగబలి, పరేషాన్, భాగ్ సాలే సినిమాలతో పాటు జేడీ చక్రవర్తి దయా వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ వారంమరికొన్ని హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగుతో పాటు, పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొత్తం 23 నిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు సిద్ధమయైపోయాయి. మెగాస్టార్ భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ కూడా ఇదే వారంలో థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న కొత్త కంటెంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హిడింబ
అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ చిత్రం ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. న్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూలై 20న థియేటర్స్ లో విడుదలైంది. గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రం నిర్మత కాగా అశ్విన్ బాబు జోడీగా నందిత శ్వేత నటించింది.
పోర్ తోడిల్
తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ పోర్ తోడిల్ టీటీలోకి వచ్చేస్తోంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో శరత్‌కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటించారు.జూన్ 9 న విడుదలైన ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 11 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు చిత్రాలతో పాటు తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు రానున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు
నెట్‌ఫ్లిక్స్
లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08
జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08
మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11
పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11
బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12
అమెజాన్ ప్రైమ్
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10
రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11
హాట్‌స్టార్
నెయ్‍మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11
జియో సినిమా
జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11
ఆహా
హిడింబి (తెలుగు సినిమా) - ఆగస్టు 10
వేరే మారి ఆఫీస్(తమిళ సిరీస్) -ఆగస్టు 10
వాన్ మూండ్రు (తమిళ చిత్రం)-ఆగస్టు 11
జీ 5
అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) -ఆగస్టు 11
ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ -ఆగస్టు 11
సోనీ లివ్
ద జెంగబూర్ర కర్స్ (హిందీ సిరీస్) -ఆగస్టు 9
పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ మూవి) -ఆగస్టు 11
లయన్స్ గేట్ ప్లే
హై హీట్( ఇంగ్లీష్ సినిమా) -ఆగస్టు 11
ఆపిల్ ప్లస్ టీవీ
స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్ -ఆగస్టు 09