ఎన్టీఆర్ సినిమాలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు..
X
ప్రస్తుతం ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. RRR తర్వాత ఎన్టీయార్, ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రీలీజైన ఈ మూవీ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ తో మూవీ ఏ విధంగా ఉండబోతుందనేది కొరటాల చెప్పేశారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజైంది.
కొరటాల శివ వాయిస్ ఓవర్తో వచ్చిన ఈ వీడియో ఎన్టీయార్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎన్టీఆర్ పాత్ర ఏ రేంజ్లో ఉంటుందో ఈ వీడియోతో చెప్పారు. ‘‘ ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లకు దేవుడు అంటే భయం లేదు.. చావు అంటే భయం లేదు. ఒకే ఒక్కటంటే వారికి భయం. ఆ భయం ఉండాలి.. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కు వెళ్తుందనేది ఎమోషనల్ రైడ్’’ అని కొరటాలు చెప్పారు.
సముద్రం బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
250 days to witness fear unleash on the big screen 💥🌊
— Devara (@DevaraMovie) July 30, 2023
Vastunna….#Devara from 5th April 2024. pic.twitter.com/CCaARI8Fwm