Home > సినిమా > స్టార్ హీరోపై 35 కేసులు..షాక్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ!

స్టార్ హీరోపై 35 కేసులు..షాక్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ!

స్టార్ హీరోపై 35 కేసులు..షాక్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ!
X

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భార్య, గర్ల్‌ఫ్రెండ్ మధ్య ఇప్పటికే గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ఈ స్టార్ హీరో దర్శన్‌పై మరో కొత్త కేసు నమోదైంది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. గత ఏడాది డిసెంబర్ నెలలో దర్శన్ నటించిన 'కాటేరా' అనే మూవీ విడుదలైంది. ఆ మూవీతో ఆయన భారీ హిట్‌ను అందుకున్నారు. కేవలం కన్నడ భాషలోనే ఆ మూవీ విడుదలైంది. సుమారు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ మూవీ హిట్‌తో సంతోషంలో ఉన్న దర్శన్‌కు షాక్ తగిలింది.

ఇప్పటికే దర్శన్ భార్య విజయలక్ష్మికి, ప్రియురాలు పవిత్రా గౌడకు వార్ నడుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి దర్శన్‌పై కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదులు కూడా అందాయి. అయితే అవి చాలవన్నట్లుగా ఆయనపై 35 మంది మహిళలు కంప్లైంట్స్ ఇచ్చారు. బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో శ్రీ శక్తి మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన 35 మంది మహిళలు ఫిర్యాదులు చేశారు.

శాండల్ వుడ్ చిత్ర పరిశ్రమలోని నిర్మాత ఉమాపతిపై దర్శన్ అసభ్య పదజాలంతో మాట్లాడారని, అలాగే మహిళలను కించ పరుస్తూ మాట్లాడారనే అభియోగాలపై కేసు నమోదైంది. సభలు, సమావేశాల్లో దర్శన్ మహిళలపై నోరు పారేసుకుంటున్నారని వారంతా ఫిర్యాదుల్లో నమోదు చేశారు. అయితే ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని, అందుకు దర్శన్ ఏం వివరణ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.


Updated : 24 Feb 2024 4:59 PM IST
Tags:    
Next Story
Share it
Top