Bigg Boss 7 Telugu: తొలిరోజే ట్విస్ట్.. రూ.35 లక్షలు ఇచ్చి..
X
బిగ్బాస్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఏడవ సీజన్ ఇవాళ (సెప్టెంబర్ 3) రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. మరోసారి నాగార్జున హోస్ట్గా వస్తున్న ఈ సీజన్లో దాదాపు 22 మంది కంటెస్టెంట్స్ ఉంటారని టాక్. అయితే, ఇప్పటివరకు సీజన్ గురించి ఎలాంటి వార్త బయటికి లీక్ కాకుండా మేనేజ్మెంట్ జాగ్రత్త పడింది. అంతేకాకుండా ఈ 7వ సీజన్ అన్ని సీజన్లలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుందని.. అందుకే ఉల్టా పల్టా అని పేరు పెట్టామని బిగ్బాస్ మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పుకొచ్చింది. మరోకొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సీజన్కు.. తాజా ప్రోమోను విడుదల చేశారు. అందులో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ.. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు.
నిజానికి సీజన్ ఫైనల్లో విన్నింగ్ ప్రైజ్ మనీలో కొంత అమౌంట్ ఇస్తూ.. ఫైనల్ నుంచి డ్రాప్ ఔట్ అయిన వాళ్లకు ఆ అమౌంట్ ఇస్తామని ప్రకటిస్తారు. ఇదంతా 100 రోజుల ఆట పూర్తైన తర్వాతే ఉంటుంది. కానీ, ఈ ఉల్టా పల్టా సీజన్లో మాత్రం పూర్తి డిఫరెంట్. బిగ్బాస్ హౌజ్లోకి వెళ్లిన తొలి 5 గురు కంటెస్టెంట్స్కు ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రూ.35 లక్షలున్న సూట్ కేస్తో హౌజ్లోకి పంపించి.. తొలి రోజే గేమ్ నుంచి డ్రాప్ అంటే ఇంటి నుంచి బయటికి వస్తే ఆ డబ్బంతా వాళ్లకే అని ట్విస్ట్ పెట్టారు. నాగార్జున్ ఆఫర్ ప్రకటించగానే ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ సూట్ కేస్ కోసం కొట్టుకోవడం ప్రోమోలో కనిపిస్తుంది. అయితే ఇందులో ఏదో జమ్మిక్కు ఉందని, అదే బిగ్బాస్ ఉల్టా పల్టా అని అభిమానులు అనుకుంటున్నారు.