Home > సినిమా > సామాన్యులపై జీఎస్టీ మోత.. ట్యాక్స్ పెరిగేవి, తగ్గేవి ఇవే..?

సామాన్యులపై జీఎస్టీ మోత.. ట్యాక్స్ పెరిగేవి, తగ్గేవి ఇవే..?

సామాన్యులపై జీఎస్టీ మోత.. ట్యాక్స్ పెరిగేవి, తగ్గేవి ఇవే..?
X

కామన్ మ్యాన్.. థియేటర్స్ లో స్కాక్స్ కొనాలంటే మామూలుగా.. వెనకా ముందు ఆలోచిస్తుంటారు. టికెట్ రేట్స్ కన్నా.. స్కాక్స్ రేట్లే ఎక్కువ ఉంటాయని అటువైపు వెళ్లడానికి ఇష్టపడరు. తాజాగా సినిమా థియేటర్లలో ఆహారం, కూల్ డ్రింక్స్ పై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలికి ఫిట్మెంట్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జరిగే సమావేశం అనంతరం ఈ నిర్ణయం అమలవుతుంది. థియేటర్లలో కూడా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే జీఎస్టీని అమలు చేస్తారు.

దీంతో పాటు.. ఆన్ లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, కేసినోలపై 28 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ మండలి అభిప్రాయపడింది. అరుదైన వ్యాధుల చికిత్సకు ఫారెన్ నుంచి దిగుమతి చేసుకునే మందులపై ప్రస్తుతం 12 శాతం ట్యాక్స్ ఉంది. దానిపై మినహాయింపు కలిగించే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు యుటిలిటీ వెహికల్స్ పై 22శాతం కాంపన్సేషన్ సెస్సు వేటిపై విధిస్తారో క్లారిటీ రానుంది.




Updated : 7 July 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top