Home > సినిమా > సోనూసూద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అభిమాని...మనసు దోచుకున్నాడంటూ ట్వీట్

సోనూసూద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అభిమాని...మనసు దోచుకున్నాడంటూ ట్వీట్

సోనూసూద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అభిమాని...మనసు దోచుకున్నాడంటూ ట్వీట్
X

సోనూసూద్..సినిమాల్లో విలన్ అయిన నిజజీవితంలో హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా టైంలో ఎందరో నిస్సాహాయులకి చేయూతనందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించిన..రీయల్ లైఫ్ లో మాకు మాత్రం హీరోనే అంటారు ఆయన అభిమానులు. కోవిడ్ సమయంలోనే కాకుండా తన దగ్గరికి సహయం అంటూ వస్తే తన వంతు సహాయం చేస్తు ఉంటాడు. అనేక సేవ కార్యక్రమాలతో ప్రజల మన్ననలను పొందారు సోనూసూద్.

అయితే బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు ఓ అజ్ఞాత అభిమాని స్వీట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇటీవల ముంబైలోని ఒక రెస్టారెంట్‌ లో ఆయన తన కుటుంబంతో కలిసి భోజనానికి వెళ్లాడు. తీరా తినడం అయ్యాక బిల్‌ తీసుకునేందుకు తన వద్దకు ఎవరూ రాలేదు. దీంతో సోనూసూద్‌ వెళ్లి బిల్లు ఎంత అయిందని వెళ్లి సిబ్బందిని అడిగాడు. దీంతో తన ఫుడ్‌ బిల్లు మొత్తం ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించాడని సోనూసూద్ కి చెప్పారు.

రెస్టారెంట్ సిబ్బంది మాటలకు సోనూసూద్, అతని కుటుంబ సభ్యలు బిత్తరపోయారు. అంతేగాక ఆ అభిమాని సోనూసూద్ కోసం ఒక నోట్ కూడా రాశాడు. 'దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా నుంచి చిన్న కృతజ్ఞత ఇది' అంటూ ఒక చిన్న కాగితంపై రాసి ఉంచాడు. అయితే తాజాగా ఈ విషయాన్ని సోనూ భాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.. కానీ, మా డిన్నర్‌ బిల్లు మొత్తం కట్టేసి ఈ స్వీట్‌ నోట్‌ను వదిలేసి వెళ్లారని... తన హృదయాన్ని అతను గెలుచుకున్నాడంటూ పోస్ట్ పెట్టాడు. కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడ్డ చాలామంది ప్రజలకు సోనూ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. నిస్వార్థ సేవాగుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సోనూసూద్ సంపాదించుకున్నాడు.

Updated : 24 Feb 2024 9:23 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top