Bigg Boss7 : నేను ఇంటికెళ్లిపోతా..బోరున ఏడ్చేసిన ప్రిన్స్
X
బిగ్‌బాస్ 7 అంతా ఉల్టాపుల్టాగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఎవరూ ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆటలో చూపించాల్సిన టాలెంట్‌ను ఫ్రీ టైంలో ఎక్కువగా చూపిస్తున్నారు. కొందరైతే ఫుటేజీ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో మాయాస్త్ర టాస్క్ జరుగుతోంది. మహాబలి టీమ్‌లో గొడవల కారణంగా టాస్క్ ఇంకా కొనసాగుతోంది. ఈ టాస్క్ గురించి తాజా అప్‌డేట్ ఇస్తూ బిగ్ బాస్ నుంచి ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది.
మాయాస్త్ర టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ మాయాస్త్ర పొందేందుకు ఎవరు అర్హులు కారో చెప్పి , వారి దగ్గరున్న భాగాన్ని తీసుకుని అదే టీమ్‌లోని మరో కంటెస్టెంట్‌కి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో చెలరేగిపోయిన గౌతమ్ ప్రిన్స్ దగ్గర ఉన్న భాగాన్ని తీసుకుని శివాజీకి ఇవ్వబోతాడు. ఈ క్రమంలో గౌతమ్ మాటలు విని ప్రిన్స్ శివాలెత్తిపోయాడు. నువ్వు చెప్పే కారణం ఇదా..అంటూ గట్టిగా అరిచాడు. గౌతమ్, ప్రిన్స్ యావర్ ఇద్దరూ ఓ రేంజ్లో ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు..ఒకానొక టైంలో ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. దీంతో అసహనాన్ని కోల్పోయిన ప్రిన్స్ బోరుమని ఏడ్చేశాడు. నాకు న్యాయం కావాలని కన్నీరుపెట్టుకున్నాడు. ఈలోపు సీన్లోకి అమర్ ఎంట్రీ ఇచ్చి ప్రిన్స్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతమందిని ఏడిపిస్తున్న మహాబలి టీమ్ ఏం బాగుపడుతుందో నాకు అర్థం కాదు అని సెటైర్లు వేశాడు
"ఇది బ్యాడ్ గేమ్..నేను ఇంటికెళ్లిపోతా. గేటు తెరవండి" అంటూ రిక్వెస్ట్ చేస్తున్న ప్రిన్స్ ప్రోమో పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రిన్స్ యావర్ నిజాయితీగా గేమ్ అడుతున్నాడని అతడిని సపోర్ట్ చేస్తున్నారు. రైతు బిడ్డ అని పల్లవి ప్రశాంత్ చెప్పుకుంటే తిట్టారు, మరి గౌతమ్ ఎందుకు? పదేపదే డాక్టర్ ని అని విర్రవీగుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన మాత్రం డాక్టర్ అని అన్నిసార్లు చెప్పుకోవచ్చా..దానిపై ఎవరూ నోరు విప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ చేస్తే తప్పు, గౌతమ్ చేస్తే ఒప్పా? ఇదేం గేమ్ అని నెటిజన్స్ నిలదీస్తున్నారు.