Home > సినిమా > ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్
X

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నటరత్నాలు. క్రైమ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి శివనాగు దర్శకుడు.చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై చంటి యలమాటి, డాక్టర్ దివ్య నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. సినిమాపై ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన నలుగురు కుర్రాళ్లు అనుకోకుండా ఒక అమ్మాయి హత్యాచారం కేస్ లో ఇరుక్కుంటారు. అది కూడా తాము కథ చెప్పిన నిర్మాత వల్లే. దీంతో తప్పు చేయని వీరిని పోలీస్ లు వెంటాడుతూ ఉంటారు. వారి నుంచి తప్పించుకుంటూనే తాము నేరం చేయలేదు అని రుజువు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు ఈ కథకు సమాంతరంగా సినిమా చేస్తున్నట్టుగానూ కనిపిస్తోంది. మరి వీళ్లు సినిమా తీశారా లేదా.. ఆ అమ్మాయిని చంపింది ఎవరు.. ఎందుకు చంపారు. ఈ కేస్ లను పోలీస్ లు ఎలా ఛేదించారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. కామెడీ, క్రైమ్, థ్రిల్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది.

ఈ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో

నటీనటులు :

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి మరియు టైగర్ శేషాద్రి.

టెక్నీషియన్స్ :

నిర్మాణం : చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : చంటి యలమాటి, డాక్టర్ దివ్య

సహ నిర్మాతలు : ఆనందాసు శ్రీ మణికంఠ, కోయి సుబ్బారావు

మ్యూజిక్ : శంకర్ మహదేవ్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నర్రా శివనాగు

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

పిఆర్ఓ : మధు VR

Updated : 21 Jan 2024 9:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top