Home > సినిమా > ఆ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

ఆ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

ఆ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్
X

తన సహజసిద్ధమైన నటనతో సింగింగ్ టాలెంట్‎తో అతి కొద్ది కాలంలోనే మలయాళ కుట్టీ నిత్యా మీనన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ నటించి తిరుగులేని హీరోయిన్‎గా క్రేజ్‎ను సంపాదించుకుంది. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది నిత్యా. ఇప్పుడు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కామాంధులు అన్ని చోట్ల ఉంటారని, తనను ఓ హీరో లైంగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది . దీంతో ఇప్పుడు నిత్యా మీనన్ వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.




అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‎లో ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. తొలి సినిమాలోనే తనదైన నటనతో అందరినీ ఫిదా చేసేసింది నిత్యా. ఆ తరువాత తెలుగులో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. నటనకు తోడు తనలోని మరో టాలెంట్‎ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ బ్యూటీ. కొన్ని సినిమాల్లో పాటలు పాడి మంచి క్రేజ్‎ను సంపాదించుకుంది. దీంతో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‎ను కొట్టేసింది.




ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి అందరినీ షాక్‎కు గురిచేసింది. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఈ క్రమంలో లేటెస్టుగా నిత్యా మీడియా ముందు తనకు ఎదురైనా చేదు అనుభవాలను చెప్పింది. ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడుతూ" కామాంధులు అన్ని పరిశ్రమల్లోనూ ఉంటారు. టాలీవుడ్‎లో ఇప్పటి వరకు నేను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు. నన్ను అసభ్యంగా తాకాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు" అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. దీంతో నిత్యా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.




Updated : 15 Jun 2023 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top