Home > సినిమా > Salaar: కాళ్లు పట్టుకున్న ప్రభాస్.. విషయం తెలిసి కాలర్ ఎగరేస్తున్న అభిమానులు

Salaar: కాళ్లు పట్టుకున్న ప్రభాస్.. విషయం తెలిసి కాలర్ ఎగరేస్తున్న అభిమానులు

Salaar: కాళ్లు పట్టుకున్న ప్రభాస్.. విషయం తెలిసి కాలర్ ఎగరేస్తున్న అభిమానులు
X

రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకే కాదు.. వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ కు డార్లింగ్ అయిపోయాడు. బాహుబలి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిన ప్రభాస్.. మరోసారి కల్కీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుంటే.. అతన్ని అంతా మారాజు అంటుంటారు. ప్రభాస్ ఆతిథ్యం, వ్యక్తిత్వానికి అంతా ఫిదా అయిపోతుంటారు. అతని టాపిక్ వచ్చిన ప్రతీసారి వాటి గురించి కథలు కథలుగా చెప్తుంటారు. వాటిని వింటూ ప్రభాస్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతుంటారు. ‘మావోడు ఇండస్ట్రీకి రాజు’ అంటూ కాలర్ ఎగరేస్తుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బతో రికార్డులను గల్లంతు చేశాడు. సినిమా స్టోరీ, టేకింగ్ అంతా ఒక ఎత్తైతే.. ప్రభాస్ కటౌట్ తో సినిమా తీయడం మరో ఎత్తు. ఆ కటౌట్ ను కరెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కడే అని.. ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతుంటారు.





కాగా సినిమా విషయానికి వస్తే.. రెండు పార్ట్ ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. శౌర్యాంగ పర్వానికి సంబంధించిన చాలా ప్రశ్నలు రెండో పార్ట్ తో తేలనున్నాయి. దీంతో సలార్ పార్ట్ 2పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ కు థియేటర్స్ అన్నీ అరుపులు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ టైంలో ప్రభాస్ చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారట. అదేంటంటే.. సినిమా క్లైమాక్స్ ఫైట్ ముందు సభ జరుగుతుంది. ఆ సభలో నారంగ్ వరద రాజ మన్నార్ ను చంపేందుకు వెళ్తుంటాడు. అప్పుడు వరదాను చంపొద్దని, కావాలంటే తనను చంపాలని సలార్ (దేవ) నారంగ్ కాళ్లు పట్టుకుంటాడు. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒకరి కాళ్లు పట్టుకోవడం కరెక్ట్ కాదని.. ఏ డైరెక్టరైనా ఆ సీన్ లో డూప్ ను పెట్టి షూట్ చేస్తారు. కానీ సినిమాలో ప్రభాస్ నిజంగానే నారంగ్ కాళ్లు పట్టుకున్నాడట.

ఈ సీన్ కు డూప్ అక్కర్లేదని.. తానే సీన్ చేస్తానని ప్రభాసే స్వయంగా షూటింగ్ కు వచ్చాడట. ఈ విషయం బయటికి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాలార్ ఎగరేస్తున్నారు. దటీజ్ ప్రభాస్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోనే అనేందుకు మరో ఎగ్జామ్ పుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.




Updated : 29 Jan 2024 9:12 AM IST
Tags:    
Next Story
Share it
Top