Home > సినిమా > సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత.. రామ్ చరణ్

సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత.. రామ్ చరణ్

సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత.. రామ్ చరణ్
X

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు,మంత్రి ఉదయనిధి స్టాలిన్.. రెండ్రోజుల క్రితం సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని దీనిని పూర్తిగా నిర్మూలించాలంటూ స్టాలిన్ చేసిన కామెంట్స్‌పై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశంలోని పలువురు నేతలు, ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఉదయనిధి వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.





ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది. స్టాలిన్‌కు సపోర్ట్ చేస్తూ కొందరూ.. సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సనాతన ధర్మం’పై గతం(2020)లో ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్‌ చరణ్‌ చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైర‌ల్‌గా మారింది. ఆ పాత ట్వీట్‌లో తన తల్లి సురేఖ ఇంట్లోని తులసి కోట వద్ద పూజ చేస్తున్న ఫొటో షేర్‌ చేస్తూ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత’ అని ట్వీట్ చేశారు. 2020 సెప్టెంబర్‌ 11 నాటి ఈ పోస్టు తాజాగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాంచరణ్‌ను చూసి ఉదయనిధి స్టాలిన్ బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగం చేయడమే కాకుండా.. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని లేఖలో ప్రస్తావించారు. దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎన్‌ ధింగ్రా తదితరులు లేఖలో సంతకం చేసినవారిలో ఉన్నారు.








Updated : 6 Sept 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top