Home > సినిమా > అభిమానమంటే ఇదేరా..షారూక్ ముఖాన్ని ఎలా చెక్కాడంటే..

అభిమానమంటే ఇదేరా..షారూక్ ముఖాన్ని ఎలా చెక్కాడంటే..

అభిమానమంటే ఇదేరా..షారూక్ ముఖాన్ని ఎలా చెక్కాడంటే..
X

బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. సినిమా విడుదలైన రెండో రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. దేశవ్యాప్తంగా జవాన్ దుమ్ముదులుపుతోంది. ఈ చిత్రంతో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‏గా మొదటిసారి బాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తన మార్క్‎ను చూపించాడు. పఠాన్ తరువాత జవాన్ మరోసారి భారీ హిట్ సొంతం చేసుకోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో షారుక్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. తాజాగా ఆర్టిస్ట్ ప్రీతమ్ బెనర్జీ షారూఖ్‎పై ఉన్న అభిమానంతో అద్భుతమైన ఆర్ట్ వేశాడు. మేడ మీద చిన్న చిన్న మార్బుల్ స్టోన్స్‎తో షారుక్ ముఖాన్ని చాలా అందంగా చెక్కాడు. నల్లని క్యాన్వాస్ మీద 30 అడుగల పరిమాణంతో మార్బుల్ స్టోన్స్ ఉపయోగించి ఇంటి మేడపైన షారూఖ్ భారీ ముఖాన్ని అందంగా తీర్చి దిద్దాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. షారుక్ భారీ ముఖాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆర్టిస్ట్ ఆర్ట్‎కు ఫిదా అవుతున్నారు.

ఆర్టిస్ట్ ప్రీతమ్ మాట్లాడుతూ.. "ఈ ఆర్ట్ నా హృదయం నుంచి వచ్చింది. షారూఖ్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అభిమానించే కళ కన్నా ఎక్కువగా ఆయన్ని నేను ప్రేమిస్తాను.నా ఈ చిత్రాన్ని తప్పనిసరిగా షారుక్ చూస్తారని ఆశిస్తున్నా' అని తెలిపాడు. ప్రీతమ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. షారూఖ్‎కు సరైన ట్రిబ్యూట్ ఇచ్చావంటూ పొగిడేస్తున్నారు. మరికొందరు ఓ మై గాడ్.. వాట్ ఏ క్రియేటివిటీ అంటూ ప్రశంసిస్తున్నారు.





Updated : 9 Sept 2023 8:53 PM IST
Tags:    
Next Story
Share it
Top