వరుణ్ తేజ్‌కు షాకిచ్చిన అమెజాన్.. 'మట్కా' పనైపోయిందా?
X
మెగా హీరోలకు ఈ మధ్య సరైన హిట్లు లేవు. సక్సెస్ ఫుల్‌గా వరుస హిట్స్ అందుకుంటున్నవారు తక్కువనే చెప్పాలి. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. సినీ కెరీర్‌లో సరైన సక్సెస్‌ను వరుణ్ అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్య నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గానే మిగులుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్..కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్’తో తెరకెక్కుతోంది.
60, 70వ దశకంలో ఇండియాలో మట్కా అనే గేమ్ ఆడేవారు. ఆ గేమ్ వల్ల ఎన్నో జీవితాలు తలకిందులయ్యాయి. ఆ గేమ్ వల్ల రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవితంలో జరిగిన విషయాలను సినిమాగా చేస్తున్నారు. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. మట్కా మూవీలో నాలుగైదు గెటప్స్‌తో వరుణ్ కనిపించనున్నాడు. ఈసారి భారీ హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న వరుణ్‌కు అమెజాన్ ప్రైమ్ గట్టి షాకే ఇచ్చింది.
తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ మట్కా కింగ్ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ కూడా రతన్ ఖాత్రిదేనని ముంబై మీడియాలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ ఇందులో టైటిల్ రోల్ చేస్తున్నారు. నాగరాజు మంజులే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక వేళ మట్కాలో వరుణ్ చేస్తున్న స్టోరీ, వెబ్ సిరీస్‌లో చేస్తున్న స్టోరీ రతన్ ఖాత్రిదే అయితే వరుణ్‌కు మరో డిజాస్టర్ తప్పదు. ఏది ముందు విడుదలైతే అదే పాపులర్ కానుంది. ఒకవేళ ఏది ముందు విడుదలైనా కూడా మట్కాకే పెద్ద దెబ్బ తగలనుంది. దీంతో వరుణ్ మరోసారి డిజాస్టర్ స్టార్‌గా మిగిలిపోనున్నాడు.