Home > సినిమా > బాలయ్య బర్త్‌డే ముందే నందమూరి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్

బాలయ్య బర్త్‌డే ముందే నందమూరి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్

బాలయ్య బర్త్‌డే ముందే నందమూరి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్
X

జూన్ 10న..నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. అభిమాన హీరో బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుట్టినరోజున నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు బాల్యయ్య తదుపరి చిత్రాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ రానున్నాయి.

అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు వేసుకున్న బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. NBK108 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విజయదశమి కానుకగా చిత్రం అభిమానుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే బాలయ్య బర్త్ డే పురస్కరించుకొని NBK108 అదిరిపోయే సర్ ఫ్రైజ్ ప్లాన్ చేసింది. NBK108 పవర్ ఫుల్ టైటిల్ ను లాంచ్ చేయనున్నారు. పుట్టిన రోజున కంటే రెండు రోజుల ముందే...అనగా జూన్ 8న టైటిల్ ప్రకటించనున్నారు. టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి డబుల్ ట్రీట్ అందించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా జూన్ 10న వీటన్నింటికి మించి అతి భారీ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశారని టాక్. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరోవైపు బాలకృష్ణ యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించనుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను కూడా బాలయ్య పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించే అవకావం ఉంది.


Updated : 6 Jun 2023 6:48 PM IST
Tags:    
Next Story
Share it
Top