Home > సినిమా > Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పై ఓ స్టార్ హీరో కుట్ర..?

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పై ఓ స్టార్ హీరో కుట్ర..?

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పై ఓ స్టార్ హీరో కుట్ర..?
X

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ యూత్ సెన్సేషన్. పెళ్లిచూపులతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు అర్జున్ రెడ్డితో అందరూ అవాక్కయ్యే హిట్ కొట్టాడు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్గా మారాడు. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందం మూవీ కూడా 100కోట్ల కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.

తాజాగా విజయ్ - సమంత జంటగా నటించిన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ శివ నిర్వాణ నాస్తికత్వానికి, భక్తికి సంబంధించిన పాయింట్ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్తో సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాపై కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్గా మారిన విజయ్ని దెబ్బకొట్టడానికే ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తాను స్టార్ ఇమేజ్ సంపాదించడానికి చాలా ఏళ్లు పట్టిందని.. కానీ విజయ్ చాలా వేగంగా ఈ స్థాయిని అందుకున్నాడని గతంలో మెగాస్టార్ చిరంజీవే అన్నారు.

ఈ క్రమంలో కొందరు విజయ్ను చూసి ఓర్వడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. అదేవిధంగా విజయ్ యాటిట్యూడ్ కూడా అతడిపై నెగిటివిటీకి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయని చెప్తున్నారు. నెగెటివిటీని స్ప్రెడ్ చేయడంతో ఆ డిజాస్టర్గా మిగిలిందన్నారు.





ప్రస్తుతం ఖుషి సినిమాని దెబ్బ తీయడానికి కుట్ర జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖుషి సినిమాకు బుక్ మై షోలో మంచి రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు ఇంకా బెటర్ రేటింగే ఉండాలి కానీ అలా జరగలేదట. అయితే రేటింగ్ తగ్గడం వెనుక ఒక స్టార్ హీరో పీఆర్వో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు పది వేల ఫేక్ అకౌంట్ల ద్వారా సింగిల్ స్టార్ రేటింగ్ ఇప్పించి టోటల్ రేటింగ్ తగ్గేలా చేశారని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో ఖుషి రేటింగ్ పడిపోయిందని చెప్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తేలాల్సివుంది.





Updated : 4 Sept 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top