సలార్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుండగా.. వీడియో సాంగ్ రిలీజ్.. (వీడియో)
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’ పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న ప్రభాస్.. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. స్టోరీ పరంగా చాలా ప్రశ్నలుంగా.. ప్రేక్షకులంతా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా విడుదల చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను కోరుతున్నారు.
ఇప్పటికే పార్ట్ 2 పేరును ‘సలార్ శౌర్యాంగ పర్వం’ అని మూవీ టీం ప్రకటించింది. మూవీ క్లైమాక్స్ లో దేవా (ప్రభాస్) కూడా ఒక శౌర్యాంగనే అని డైరెక్టర్ ట్విస్ట్ ఇవ్వడంతో.. ప్రేక్షకుల్లో ఆత్రుత మొదలైంది. ప్రభాస్ శౌర్యాంగ అయితే.. వరద రాజ మన్నార్ కోసం రాజ్యాన్ని వదులుకుంటాడా? వీరి మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడింది? హీరోయిన్ కోసం వరద రాజ మన్నార్ తో ఫైట్ చేస్తాడా? అనే చాలా ప్రశ్నలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికీ పార్ట్ 2లో సమాధానం దొరకనుంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్ర బృదం పార్ట్ 1లోని ఒక్కో వీడియో సాంగ్ ను విడుదల చేస్తుంది. తాజాగా మేకర్స్ ‘ఆరు సేతులున్నా’ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట లిరిక్స్.. సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటకు.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఫోక్ సింగర్ కనకవ్వ పాడారు.