Home > సినిమా > సూపర్ స్టార్ టూ ట్యాక్సీ డ్రైవర్.. లైఫ్ ఇలా మారిందేంటి..?

సూపర్ స్టార్ టూ ట్యాక్సీ డ్రైవర్.. లైఫ్ ఇలా మారిందేంటి..?

సూపర్ స్టార్ టూ ట్యాక్సీ డ్రైవర్.. లైఫ్ ఇలా మారిందేంటి..?
X

ఒకప్పుడు ఆయనో సూపర్ స్టార్.. అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. సోలో సినిమాలతో హిట్ కొట్టడమే కాదు.. అగ్ర నాయకుల పక్కన నటించి టాప్ హీరోగా ఎదిగాడు. కట్ చేస్తే.. లైఫ్ మారిపోయి కుటుంబాన్ని పోషించలేని స్థాయికి దిగజారి పోయాడు. డబ్బు కోసం బయటి దేశం వెళ్లి మెకానిక్, ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేశాడు. ఇప్పడు భారత్ కు తిరిగొచ్చి.. తన అనుభవాల్ని పంచుకున్నాడు. స్టార్ డమ్ పోయి.. లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ హీరోనే అబ్బాస్. తన లైఫ్ జర్నీని చెప్పుకొచ్చాడు..

‘అనుకోకుండా హీరోనయ్యా. నా మొదటి సినిమా ప్రేమదేశం రిలీజ్ అయినప్పుడు థియేటర్ కు వెళ్లా. మరుసటి రోజు ఇంటి ముందు వేలల్లో జనం పోగయ్యారు. వాళ్లంతా అంత ప్రేమ నాపై ఎందుకు కురిపిస్తున్నారో అర్థం కాలేదు. 19 ఏళ్ల వయసులోనే సినిమాలను నా కెరీర్ గా ఎంచుకున్నా. కెరీర్ మొదట్లోనే విజయాలు చూశా. ఫెయిల్యూర్ ను చూశా. తర్వాత కనీస అవసరాలకు డబ్బులు లేని పరిస్థితి ఎదురయింది. అవకాశాల కోసం డైరెక్టర్లను సంప్రదించా. ఆర్.బి. చౌదరి నాకు పూవెలి సినిమాలో అవకాశం ఇచ్చారు. కొన్నాళ్లకు నా నటన నాకు బోర్ కొట్టింది. దాన్ని నేను ఆస్వాదించలేకపోయా. బోర్ కొట్టడంతో సినిమాలకు దూరం అయ్యా. న్యూజిలాండ్ వెళ్లి కుంటుంబాన్ని పోషించడం కోసం బైక్ మెకానిక్, ట్యాక్సీ డ్రైవర్ గా పని చేశా’ అని చెప్పుకొచ్చాడు.


Updated : 18 July 2023 8:55 PM IST
Tags:    
Next Story
Share it
Top