విశాల్తో పెళ్లి వార్తలపై అభినయ క్లారిటీ!
X
తమిళ స్టార్ హీరో విశాల్ పెళ్లి విషయం చాలారోజులుగా చర్చల్లో నిలుస్తోంది. ఇటీవలే హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో వీళ్లిద్దరు ఈ పుకార్లపై స్పందించి.. అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. నటి అభినయ, విశాల్ మధ్య ప్రేమ నడుస్తుందని, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై అభినయనే క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ వార్త ఎలా చర్చల్లోకి వచ్చిందంటే..
ఇటీవల విశాల్ ను ఉద్దేశిస్తూ నటి అభినయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విశాల్ కు తాను వీరాభిమానినంటూ, ప్రేమ చదరంగం నుంచి తననను ఇష్టపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, తప్పకుండా పెళ్లి అంటూ బాంబు పేల్చుతారని అంతా అనుకున్నారు. వీటిపై స్పందించిన అభినయ.. పుకార్లకు క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఆరాధించేది రజనీకాంత్ ను. తర్వాత అంతాలా ఇష్టపడేది విశాల్ ను. పూజ సినిమాలో నేను నటించా. కానీ, విశాల్ ను కలిసే అవకాశం రాలేదు. మార్క్ ఆంటోనీలో విశాల్ తో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆయన భార్యగా కనిపించనున్నా. నాకూ విశాల్ కు పెళ్లి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. మేం రిలేషన్ లో ఉన్నామని అనుకుంటున్నారు. అదంతా అవాస్తవం’ అని అభినయ చెప్పుకొచ్చింది.