మలయాళ హీరోయిన్‌కు యాక్సిడెంట్..ఐసీయూలో చికిత్స
X
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె త్రివేండ్రంలోని ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు హెల్ప్ చేసేందుకు ముందుకు రావాలని మరో నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పొంగి ఎజు మనోహర సినిమాలో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుంధతి 7 సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించారు.
ఆమెకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుంది. మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాము. అయినప్పటికీ వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. మీ సహాయం అరుంధతికి మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుంది... అని ఆమె రాసుకొచ్చారు. అరుంధతి బ్యాంకు వివరాలు, గూగుల్ పే నెంబర్ ఆమె పంచుకున్నారు. అరుంధతి 2014లో పొంగు ఏజ్హు మనోహర అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. గత ఏడాది ఆయిరమ్ పోర్ కాసుకల్ అనే చిత్రంలో ఆమె నటించారు. అలాగే 2021లో పద్మిని, డోంట్ థింక్ అనే రెండు వెబ్ సిరీస్లలో నటించింది. అరుంధతి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.