ఆమిర్ ఖాన్‌కు కోడలు కానున్న సాయిపల్లవి.. ఎక్కడంటే!
X
అందానికి అందం, అభినయానికి అభినయం, డ్యాన్సుకు డ్యాన్సుతో అటు కుర్రాళ్లను, ఇటు పెద్దాళ్లను ఆకట్టుకునే సాయిపల్లవి కెరీర్ ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోంది. హిట్లకు దూరమైన ఈ భామ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. డబ్బుకు, అందాలు ఆరబోసే పాత్రలకు దూరంగా ఉంటే సాయిపల్లవి తనకు తగిన పాత్రతోనే హిందీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌కు ఆమె జోడీగా నటించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్. తన కొడుకు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉండాలని ఆమిర్ ఆలోచిస్తున్నాడని, అందుకే దక్షిణాది భామలైతే బావుందని సూచించాడట. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న జునైద్ తొలి మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మరో చిత్రం కూడా త్వరలో పట్టాలెక్కబోతోందని, అందులో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆమెతో చర్చలు కొలిక్కి వచ్చాయని అంటున్నారు. ఇది ఒక ప్రేమ కథా చిత్రమని చెబుతున్నారు.
30 ఏళ్ల జునైద్ అరంగేట్రం ఇప్పటికే ఆలస్యమైంది బాలీవుడ్ టాక్. అమెరికాలో నటనలో శిక్షణ తీసుకున్న జునైద్ పలు హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆమె ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా అతడే. జునైద్, శ్రీదేవి రెండో కూతురు ఖషి కపూర్ జంటగా ఓ తమిళ్ రీమేక్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అతని తొలి సినిమా ఇంకా విడుదల కాకముందే ఇంత హడావుడి ఏమిటని కొందరు విస్తుబోతున్నారు.