Home > సినిమా > ఆ డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించాను..అబ్బాస్

ఆ డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించాను..అబ్బాస్

ఆ డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించాను..అబ్బాస్
X

90 కిడ్స్‎కు అబ్బాస్ గురించి స్పెషల్‎గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్‎గా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు అబ్బాస్. అబ్బాస్ ప్రేమ్ దేశం సినిమా అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో అబ్బాస్‎కు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. ఇదే మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అబ్బాస్ చేసి ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. అమ్మాయిల కలల రాకుమారుడు మారాడు. రాజహంస, రాజా, నీ ప్రేమకై, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, శ్వేతనాగు, నరసింహ, అనసూయ ఇలా దాదాపు 50 సినిమాల్లో అబ్బాస్ నటించాడు. కెరీర్ మంచి పీక్స్‎లో ఉన్నప్పుడే ఎందుకో ఏమో 2015 నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. రీసెంట్‎గా చెన్నై వచ్చిన అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

అబ్బాస్ అప్పట్లో హార్పిక్ యాడ్‎లో కనిపించడంతో ఆయన్ని చాలా మంది ట్రోల్ చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. అబ్బాస్‎ను ఎక్కిరిస్తూ వీడియోలు కూడా చేశారు. అ సమయంలో తనను ఎంతోమంది ట్రోల్ చేసినా పెద్దగా పట్టించుకోలేదని లేటెస్టుగా చేసిన ఓ ఇంటర్వ్యూలో అబ్బాస్ తెలిపారు. " టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో నటించడంతో నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.నన్ను విమర్శించారు. అయితే అవేమీ నన్ను బాధపెట్టలేదు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆ ప్రకటనలో నటించాను. ఆ యాడ్‌ ఆఫర్‌ వచ్చినప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. అందుకే ఓకే చెప్పాను. దాదాపు దాదాపు ఎనిమిదేళ్ల కాంట్రాక్ట్‌ నాకు కుదిరింది. అంతేకాకుండా సంస్థ వాళ్లు మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఆ డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించుకున్నాను. అందులో నటించడం వల్ల జరిగిన నష్టం ఏమిటి? తప్పేముంది? . నా దృష్టిలో అన్ని వృత్తులు సమానమే. ప్రతి ఒక్కరు వారి ఫ్యామిలీ కోసమే కష్టపడతారు. నేను అదే చేశాను" అని అబ్బాస్ తెలిపారు.



Updated : 5 Aug 2023 1:34 PM IST
Tags:    
Next Story
Share it
Top