Home > సినిమా > జగదేకవీరుడు అతిలోక సుందరి ‘మాలోకం’ ఇకలేరు

జగదేకవీరుడు అతిలోక సుందరి ‘మాలోకం’ ఇకలేరు

జగదేకవీరుడు అతిలోక సుందరి ‘మాలోకం’ ఇకలేరు
X

కోలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు. శివాజీ వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రముఖ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు. 1981లో వచ్చిన ‘పన్నీర్ పుష్పాలు’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కోలమావు కోకిల, సూరరై పొట్రు, ధారల ప్రభు, గార్గి వంటి చిత్రాల్లో నటించారు.





స్టార్ హీరో కమల్ హాసన్తో శివాజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఎక్కువగా క‌మ‌ల్‌హాస‌న్ సినిమాల్లోనే నటించారు. క‌మ‌ల్‌ హీరోగా న‌టించిన విక్ర‌మ్‌, స‌త్య‌, అపూర్వ స‌గోద‌ర‌గ‌ళ్‌, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు, గుణ‌, చాచి 420, అన్బేశివంతో పాటు ప‌లు సినిమాల్లో శివాజీ కమెడియన్‌గా నటించారు. చివరగా ఆయన యోగిబాబు లక్కీ మ్యాన్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబన్ 1న రిలీజ్ అయ్యింది.





మెగాస్టార్ చిరంజీవి జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమాతో ఆర్ఎస్ శివాజీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మాలోకం అనే కానిస్టేబుల్ పాత్రలో నవ్వులు పూయించారు. ఎంతో ఎత్తుకు.. హిమాలయాల వరకు వెళ్లిపోయాను సర్ అంటూ అతడు చెప్పే డైలాగ్కు నవ్వకుండా ఉండలేరు. గతేడాది రిలీజ్ అయిన సాయిపల్లి గార్గి మూవీలో ఆయన కీలక పాత్రలో నటించారు. గార్గి సినిమాలో సాయిపల్లవి తండ్రిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

Updated : 2 Sep 2023 12:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top