Home > సినిమా > Hyper Aadi : అంబటి రాంబాబుకు హైపర్ ఆది కౌంటర్

Hyper Aadi : అంబటి రాంబాబుకు హైపర్ ఆది కౌంటర్

Hyper Aadi : అంబటి రాంబాబుకు హైపర్ ఆది కౌంటర్
X

మెగాస్టార్ చిరంజీవికి కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలతో పాటు పలువురు నటీనటులు చిరంజీవిని అభిమానిస్తారు. వారిలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది ఒకరు. ఇప్పటికే పలు సందర్భాల్లో చిరంజీవి, మెగా ఫ్యామిలీపై తన భక్తిని చాటుకున్నారు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా తన అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించినటు సాగిన హైపర్ ఆది స్పీప్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అంబటికి కౌంటర్..

బ్రో కలెక్షన్స్‌పై విమర్శలు చేసిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు. " భోళా శంకర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత గారు మీరు రోజూ ఎంత కలెక్షన్స్ వచ్చిందని చూసుకోవక్కర్లేదు. ఎలక్షన్స్ కోసం మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్స్ కోసం మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రెస్ మీట్స్ పెట్టి మరీ సినిమా కలెక్షన్స్ లెక్కలు చెప్తారు. కాబట్టి మీరు భయపడక్కర్లేదు, మన సినిమా కలెక్షన్స్ వాళ్ళే చెప్తారు. ఎంత కలెక్షన్స్ వచ్చినా వాళ్ళు వెనకేసుకున్నంత మాత్రం మనం కలెక్ట్ చేయలేము" అని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇవి డైరెక్ట్ గా అంబటి రాంబాబును ఉద్దేశించి అన్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు హైపర్ అది చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైరల్ గా మారాయి.

బ్రో వివాదం నేపథ్యంలో...

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ చేసిన ‘శ్యాంబాబు’ అనే పాత్రపై వివాదం చెలరేగింది. ఏపీ మంత్రి ‘అంబటి రాంబాబు’ ఉద్దేశించి ఆ పాత్ర పెట్టారని వార్తలు రావడంతో డైరెక్ట్‌గా మంత్రి దీనిపై రెస్పాండ్ అయ్యారు. పవన్ పై విమర్శలు చేస్తూ, బ్రో మూవీ కలెక్షన్స్ పై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హైపర్ ఆది అంబటి రాంబాబుకి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

అందరికీ ఇచ్చిపడేశాడు...

అంబటి రాంబాబుతో పాటు నాటి నుంచి నేటి మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసినవారికి హైపర్ ఆది ఇచ్చిపడేశాడు. పేరు చెప్పకుండానే రామ్ గోపాల్ వర్మ, గరికపాటి నరసింహా రావు, జీవిత రాజశేఖర్ లాంటివారికి చురకలంటించాడు. ''తెలుగులో ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అలాగే, చిరంజీవి గురించి మాట్లాడే స్థాయి కూడా ఎవరికీ లేదు. ఆ దర్శకుడు చిన్న పెగ్ వేస్తే చిరంజీవి గారి గురించి, పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తాడు. నాకు తెలిసి మీ వ్యూహాలు దెబ్బ తింటాయని నా గట్టి నమ్మకం'' అని ఆర్జీవీని ఉద్దేశించి హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. ''కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి... కొన్ని కోట్ల మంది అభిమానించే చిరంజీవి గారి మీద అసహనం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండా, చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా! ఎదురుగా ఉన్నవాళ్లకు ఎలా ఉండాలో నేర్పించే ఆయన సహనం కోల్పోయారు గానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు. ఆ సభ సజావుగా జరిగేలా చేశారు" అంటూ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును ఉద్దేశించి ఆది వేసిన కౌంటర్స్ వైరల్ అవతున్నాయి.




Updated : 7 Aug 2023 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top