Home > సినిమా > గుండె పోటుతో ‘భద్రాచలం’ మూవీ విలన్‌ కన్నుమూత

గుండె పోటుతో ‘భద్రాచలం’ మూవీ విలన్‌ కన్నుమూత

గుండె పోటుతో ‘భద్రాచలం’ మూవీ విలన్‌ కన్నుమూత
X

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్(46) కన్నుమూశారు. సోమవారం (జూన్ 12) రాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కాగా ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలైన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన అమ్మ కొడుకు సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కజన్‌ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.



గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాలతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లోనూ విలనీ పాత్రలు పోషించాడు. గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 2015లో వచ్చిన లైలా ఓ లైలా అనే మలయాశం మూవీలో ఆఖరి సారిగా కనిపించారు కజన్‌. ఆయన సొంత రాష్ట్రం కేరళ. అందుకే మలయాళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. కజన్‌ ఖాన్‌ మరణవార్త విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కజన్‌ ఖాన్‌ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.







Updated : 13 Jun 2023 7:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top