Home > సినిమా > నాకు ఆ డైలాగ్స్ నచ్చలేదు..'ఆదిపురుష్' నటుడు

నాకు ఆ డైలాగ్స్ నచ్చలేదు..'ఆదిపురుష్' నటుడు

నాకు ఆ డైలాగ్స్ నచ్చలేదు..ఆదిపురుష్ నటుడు
X

భారీ బడ్జెట్‎తో భారీ అంచనాలతో రిలీజైన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సినిమా హిట్ టాక్ పక్కన పెడితే, ఆదిపురుష్‎పైన రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. సినిమా బాగోలేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, రాముడి పాత్రకు ప్రభాస్ న్యాయం చేయలేదని, ఓం రౌత్ కథ అస్సలు బాగాలేదని ఇలా రకరకాలుగా ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించిన నటుడు కూడా ఆదిపురుష్‎పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ‘ఆదిపురుష్‌’‎లోని కొన్ని డైలాగ్స్‌ తనకు నచ్చలేదని, సినిమాకు ఇంత నెగిటివిటీ వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు. దీంతో ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ వార్తల్లోకెక్కింది.

ఓంరౌత్‌ డైరెక్షన్‎లో వచ్చిన ‘ఆదిపురుష్‌’లో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడి పాత్రలో కనిపించారు పంజాబీ నటుడు లావీపజ్నీ.

ఇతనికి సినిమాలో పెద్దగా సీన్స్ లేకపోయినా , కనిపించినంత సేపు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా లావీపజ్నీ ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్‎కు వస్తోన్న నెగెటివ్‌ గురించి మాట్లాడటమే కాకుండా సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇన్ని కాంట్రవర్సీలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. చిత్రంలో చాలా వరకు వివాదాస్పద డైలాగులు తీసేసినప్పటికీ.. ఒక హిందువుగా నేను ఆ డైలాగ్స్‌ విన్నప్పుడు చాలా ఆవేదనకు లోనయ్యా, నాకు నిజంగా ఆ డైలాగులు నచ్చలేదు’’ అని లావీపజ్నీ తెలిపాడు.





Updated : 29 Jun 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top