Home > సినిమా > #90's : వివాదంలో #90s నటుడు.. ‘మీకు తప్పుగా అనిపిస్తే.. సారీ’.. ట్వీట్ వైరల్

#90's : వివాదంలో #90s నటుడు.. ‘మీకు తప్పుగా అనిపిస్తే.. సారీ’.. ట్వీట్ వైరల్

#90s : వివాదంలో #90s నటుడు.. ‘మీకు తప్పుగా అనిపిస్తే.. సారీ’.. ట్వీట్ వైరల్
X

శివాజీ, వాసుకి ఆనంద్ సాయి, మౌళి తనూజ్ ప్రశాంత్, వసంతిక, రోహన్ రాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన #90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్.. అందరినీ అలరించింది. ఈటీవీ విన్ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన #90s యాక్టర్ మౌళి.. శివాజీ పెద్ద కొడుకుగా నటించిన మెప్పించాడు. దీంతో అతని క్రేజ్ బాగా పెరిగిపోయింది. సిరీస్ రాకుముందు మౌళి.. మీమ్స్, కామెడీ రీల్స్ తో సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ చేసేవాడు. దానిద్వారానే బాగా పాపులారిటీ సంపాధించుకున్నాడు. ఈ క్రమంలో మౌళి ఓ వివాదంలో ఇరుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వివాదానిపై క్లారిటీ ఇస్తూ.. మౌళి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

ఓ స్టేజ్ మీద కామెడీ చేసిన మౌళి తన చేతిని పైకి చూపిస్తూ.. ‘నేను ఇప్పుడు ఏం యామం చేశానో తెలుసా..? ఏపీ క్యాపిటల్.. చూసుకోండి కావాలంటే ఎక్కడ దొరకదూ’ అని అంటాడు. ఈ వీడియో క్లిప్ ను కట్ చేసిన కొందరు.. రాజకీయంగా బాగా వాడుకున్నారు. అది బాగా వైరల్ కావడంతో.. మౌళి చుట్టు వివాదాలు చుట్టుముట్టాయి. కొంతమంది రాజకీయ నేతలు, కార్యకర్తలు మౌళిని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు. దీనిపై స్పందించిన మౌళి.. తను కావాలని చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఒకరిని కించపరచాలని చేయలేదు. బాధపెట్టే ఉద్దేశమూ కాదు. నేను చేసిన పనికి ఎవరికైనా బాధ కలిగిస్తే.. వారికి నా క్షమాపణలు. నేను హెల్దీ కామెడీ మాత్రమే చేస్తాను. ప్రజలను నవ్వించేందుకు ప్రయత్నిస్తా. దయచేసి నా పేరెంట్స్ ను ఇందులోకి లాగొద్ద’ని ట్వీట్ చేశాడు.

Updated : 7 Feb 2024 1:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top