ఆమె దగ్గర నా బిడ్డ ఉండటం సేఫ్ కాదు..నరేష్ సంచలన వ్యాఖ్యలు
X
కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రెండీగా ఉన్న పేర్లు పవిత్ర-నరేష్. వీరిద్దరి లివింగ్ రిలేషన్ అప్పట్లో పెద్ద చర్చనీయంశంగా ఉండేది. మళ్లీ పెళ్లి సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ సినిమా అనంతరం నరేష్ ,పవిత్రలు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని మరీ తిరగడం మొదలుపెట్టేశారు. ఏ ఈవెంట్ జరిగినా కలిసి వెళ్లేవారు. వారి రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి గురించిన న్యూస్ పెద్దగా ఏమీ ఉండటం లేదు. అందుకేనేమో మరోసారి కాంట్రవర్శీ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు నరేష్. యాక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రమ్య రఘుపతి గురించి మరోసారి సెన్సేషనల్ వ్యాఖ్యాలు చేశారు.
నరేష్ మాట్లాడుతూ.. "జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. రమ్య రఘుపతి నన్ను ఎంతో బాధపెట్టింది. ఆ బాధలను ఇప్పటికీ మర్చిపోలేను. ఆమె దగ్గర నా కొడుకు ఉన్నాడు. అది ఎంత మాత్రం వాడికి సేఫ్ కాదు. ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడూ సంతోషంగా లేను. పవిత్ర నా జీవితంలోకి రావడం వల్ల మళ్లీ సంతోషంగా ఉన్నాను. నన్ను నన్నుగా అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ పవిత్ర. ఆమె నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది" అంటూ భావోద్వేగమయ్యారు. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్లపై రమ్య రఘుపతి ఏవిధంగా స్పందిస్తుందో మరి వేచిచూడాల్సిందే.