Happy Days Movie: హ్యాపిడేస్ మళ్లీ వచ్చేస్తున్నాయ్
X
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ.. హ్యాపిడేస్ ఎంతోమందికి హాట్ ఫేవరేట్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాకు.. ఇప్పటివరకు మరోటి పోటీ రాలేదు. సినిమాలో కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, లవ్, ర్యాగింగ్, స్ట్రగుల్స్, బ్యాక్ ల్యాగ్స్ ఇలా ఒక మనిషి జీవితంలో బాగా గుర్తుండిపోయే కాలేజ్ డేస్‌ను శేఖర్ కమ్ములా అద్భుతంగా చూపించాడు. సినిమాలో యాక్టర్స్ టెర్రిఫిక్ పర్మార్మెన్స్, మిక్కీ మ్యూజిక్.. అప్పటి కుర్రకారును పిచ్చెక్కించింది. క్కేసింది. ఇక ఇలాంటి కల్ట్ సినిమాను రీ-రిలీజ్ చేస్తే సినీ లవర్స్‌లో ఉండే ఎగ్‌జైట్‌మెంట్ అంతా ఇంతా కాదు.
Happy Days.. Re Release ?
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 17, 2023
Ok na ? pic.twitter.com/PoqWu3dRPj
కాగా ఈ సినిమాలో నటించిన కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్.. ఈ సినిమా రీ-రిలీజ్ గురించి ఓ ట్వీట్ వేశాడు. హ్యాపీడేస్ డేస్ సినిమా రీ-రిలీజ్ ఒకేనా అని ఓ పోస్ట్ వేశాడు. దానికి పలువురు వెయిటింగ్ అని, గ్రేట్ ఐడియా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఎందుకు పాత గాయాన్ని మళ్లీ లేపుతారు. ఈ సినిమా వల్లే నా జిందగీ మన్నుల కలిసిందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమానో లేదంటే.. సూపర్ హిట్ అయిన సినిమాలనో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. నిఖిల్ చేసిన పోస్టుకు సలార్ ను ఈ ఏడాది రిలీజ్ చేయించేలా లేరంటూ కామెంట్స్ చేశాడు.