జైభీమ్.. మళ్లీ ఏసేసిన ప్రకాశ్ రాజ్.. గాంధీ హత్య, ఎందుకు చేసుకుంటారండీ...
X
చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై వెటకారం బొమ్మను షేర్ చేసి విమర్శలు ఎదుర్కొన్న నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ వార్తలకెక్కారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రానికి అవార్డు రాకపోవడంతో తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. ‘‘మన మహాత్మాగాంధీ హత్యను సమర్థించేవారు, బాబా సాహేబ్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకునేవారు జై భీమ్ గురించి వేడుకలు చేసుకుంటారా? జస్ట్ యాస్కింగ్’’ అని ట్వీట్ వదిలారు. జైభీమ్ మూవీ పోస్టరును, పక్కన జైభీమ్ అనే మరాఠీ కవితను పోస్ట్ చేశారు.
‘‘జైభీమ్ అంటే వెలుగు, జైభీమ్ అంటే ప్రేమ, జైభీమ్ అంటే చీకట్లోంచి కాంతిలోకి ప్రయాణం, జైభీమ్ అంటే వందల కోట్ల మంది కన్నీళ్లు’’ అని ఆ కవితలో ఉంది. దీంతో కొందరు ప్రకాశ్ రాజ్‌ను విమర్శిస్తుంటే కొందరు సమర్థిస్తున్నారు. అన్న సినిమాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రకాశ్ రాజ్ ప్రతిదాన్నీ రాజకీయం చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఆయన అన్నదాంట్లో తప్పేముందని, జాతీయ సమగ్రత చిత్రంగా జైభీమ్‌కు అవార్డు వచ్చి ఉంటే బావుండేదని, దళితులపై జరిగే దారుణాలను చిత్రంలో చక్కగా చూపారని కొందరు అంటున్నారు. జైభీమ్ చిత్రానికి అవార్డు రాకపోవడంతో తన గుండె పగిలిపోయిందని నేచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ వదిలారు.
the ones who support murder of our Mahathma.. the ones who want to change Babasahebs Constitution..
will they CELEBRATE #JaiBhim ??? #justasking pic.twitter.com/QmTdI7EGPY
— Prakash Raj (@prakashraaj) August 26, 2023