Home > సినిమా > నాకు రజనీకాంత్ డబ్బులు ఇవ్వలేదు..రమాప్రభ

నాకు రజనీకాంత్ డబ్బులు ఇవ్వలేదు..రమాప్రభ

నాకు రజనీకాంత్ డబ్బులు ఇవ్వలేదు..రమాప్రభ
X

ఒకప్పుడు తన నటనతో వెండితెరమీద నవ్వులు పూయించారు అలనాటి నటి రమాప్రభ. వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే గత కొంత కాలంగా వయసు మీద పడటంతో నటనకు కాస్త దూరంగా ఉంటున్నారు. చెన్నైలోని తన ఇంట్లో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో కలిసి రమాప్రభ సంతోషంగా గడుపుతున్నారు. లేటెస్టుగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‎ను ప్రారంభించారు రమాప్రభ. తన అభిమానులతో ముచ్చటిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ మధ్యనే తన మాజీ భర్త శరత్ బాబు చనిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే రమాప్రభపై సోషల్ మీడియాలో కొంత కాలంగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. వీటిపై తాజాగా రమాప్రభ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మండిపడ్డారు. ఆ వార్తలు చూస్తుంటే జాలేస్తోందని, నవ్వు కూడా వస్తోందని ఆమె తెలిపారు. అదే విధంగా శరత్ బాబు మరణంపైన మొదటిసారిగా పరోక్షంగా స్పందించారు.

రమాప్రభ మాట్లాడుతూ..." నేను గత మూడు నెలలుగా టూర్‎లో ఉన్నాను. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లొచ్చాను. ఈ మూడు నెలల గ్యాపుల చాలా సంఘటనలు జరిగాయి. అవి ఆలోచిస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నా పేరు ఉపయోగించుకుని చాలా మంది ఫేమస్ అవుతున్నారు. నా గురించి మాట్లాడుతూ వాళ్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందులో తప్పులేదు. కానీ వారికి తెలియని, అవగాహన లేని విషయాల గురించి మాట్లాడుతున్నారు. అందుకే నేను ఆ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. నాకంటూ చెన్నైలో ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలా మంది ఉన్నారు. కానీ నా పేరును వారు చెప్పడం లేదు. అక్కడ ఉంటుందని నేను తీసుకువచ్చిన హీరో అయిన చెప్పడం లేదు. నాదైన ఇంట్లో వేరేవాళ్లు ఉంటూ అది ఎవరో ఇల్లు అని చెబుతుంటే జాలేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ నాకు డబ్బులు ఇచ్చారని చెప్పారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన నాకు డబ్బులు ఇచ్చినట్లు మీరు ఎవరైనా చూశారా. నేనే 13 ఏళ్ల నుంచే సంపాదించడం మొదలు పెట్టాను. డబ్బులు నాకు కొత్తేమీ కాదు. 14 ఏళ్లు కలిసి ఉన్నాము. నేను దూరంగా ఉన్నా శాస్త్రోక్తంగా పాటించాల్సినవి అన్నీ చేస్తున్నాను"అంటూ రమా ప్రభ వీడియోలో అన్ని విషయాల గురించి కూల్ గా మాట్లాడారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రమాప్రభకు సపోర్ట్ చేస్తున్నారు. మీ గురించి మాకు తెలుసు అమ్మా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.



Updated : 3 Jun 2023 12:44 PM IST
Tags:    
Next Story
Share it
Top