Home > సినిమా > బాహుబలి కట్టప్ప ఇంట్లో విషాదం

బాహుబలి కట్టప్ప ఇంట్లో విషాదం

బాహుబలి కట్టప్ప ఇంట్లో విషాదం
X

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైన సత్యరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నాదాంబళ్ కళింగరాయర్ కన్నుమూశారు. వృద్ధాప సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయస్సు 94 ఏళ్లు. ఆమెకు సత్యరాజ్ తో పాటు మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.





సత్యరాజ్‌ నిన్న హైదరాబాద్‌లో ఓ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన కోయంబత్తూర్‌ బయలుదేరి వెళ్లారు. సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.







Updated : 12 Aug 2023 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top