Home > సినిమా > 'మీకేం సంబంధం'.. చిరంజీవికి సపోర్ట్ చేసిన సుమన్

'మీకేం సంబంధం'.. చిరంజీవికి సపోర్ట్ చేసిన సుమన్

మీకేం సంబంధం.. చిరంజీవికి సపోర్ట్ చేసిన సుమన్
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలతో పాటూ హీరోలు, నటుల పారితోషికాలపై మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. సినీ ప్రముఖుల పారితోషికాలతో రాజకీయ నేతలకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అనేక అంశాలపై స్పందించారు. ‘మా పారితోషికాలపై మాట్లాడడం మానుకోండి, సినీ ప్రముఖుల పారితోషికాలకు, రాజకీయాలకు ఏంటి సంబంధం... సినీ పరిశ్రమ వాళ్లు పకోడీగాళ్లు కాదు, అలా విమర్శించిన వాళ్లే బజ్జీగాళ్లు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు' అని సున్నితంగా హెచ్చరించారు.





ఇక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడడం బాధ కలిగించిందన్నారు సుమన్. రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్‌పై ఎందుకు బురద చల్లుతున్నారన్నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వివాహాలపై చేస్తున్న విమర్శలపైనా స్పందించారు. రాజకీయ నాయకులకే రెండు, మూడు కుటుంబాలు ఉన్నాయని.. ఆ పేర్లు చెప్పను అన్నారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయం చేయకూడదన్న చట్టం ఉందా అని ప్రశ్నించారు. కొన్ని కారణాల వల్ల ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుందని.. దాన్ని తప్పుబట్టి పవన్‌ కళ్యాణ్‌పై బురద చల్లడం సరికాదు అన్నారు.

'ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి బాధ? పవన్‌ మాజీ భార్యలు తమకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఏమైనా కోరారా? పలు పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. దమ్ముంటే వారిపై కామెంట్‌ చేయండి. రాజకీయంగా పవన్‌ను ఎదుర్కోవాలేగాని, వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. చంద్రబాబు విజన్‌ ఉన్న వ్యక్తి, ఏపీని అన్ని విధాలుగా ఆయనే అభివృద్ధి చేశారని గుర్తు పెట్టుకోవాలి’ అని సుమన్‌ అన్నారు.




Updated : 25 Aug 2023 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top