Home > సినిమా > Vijay Antony : నేనూ చనిపోయాను : విజయ్ ఆంటోనీ

Vijay Antony : నేనూ చనిపోయాను : విజయ్ ఆంటోనీ

Vijay Antony : నేనూ చనిపోయాను : విజయ్ ఆంటోనీ
X

హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. కూతురు మృతిపై విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ట్విట్టర్లో ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కూతురుతో పాటు తాను చనిపోయానని అన్నారు. ఇకపై తాను చేయబోయే మంచి పనులన్నీ కూతురి పేరు మీదే చేస్తానని చెప్పారు.

‘‘నా కూతురు ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు కూడా. ఇప్పుడు తను కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కానీ ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేనూ చనిపోయాను. ప్రస్తుతం ఆమెతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశా. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను’’ అని విజయ్‌ ఆంటోనీ ట్వీట్‌ చేశారు.

విజయ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్, నెటిజన్స్ విజయ్‌కు ధైర్యం చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మీరా ఆత్మకు శాంతి కలగాలి, ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి, మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ నెల 19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీరా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసి.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె 12వ తరగతి చదువుతోంది. విజయ్కు ఇద్దరు కూతుళ్లు.




Updated : 21 Sept 2023 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top