నటుడు విజయ్పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్
X
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్.. నిన్న మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చివరిసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పించినా వారిని అదుపు చేయడం కష్టం అయింది. ఈ క్రమంలో దళపతి విజయ్ కూడా విజయ్ కాంత్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లాడు. అనంతరం విజయ్ తన ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా.. అతనిపై చెప్పుతో దాడి జరిగింది.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేరే నటుడి అభిమానులు (గుర్తు తెలియని వారు) విజయ్ పై దాడి చేసినట్లు తెలుస్తుంది. విజయ్ కారు ఎక్కుతుండా.. గుర్తు తెలియని వ్యక్తి అతనిపై చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ ఘటన తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీనిపై పార్టీ నాయకులు, సినీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు జరగడం దురదృష్టకరం అంటూ ఖండిస్తున్నారు.
Actor #Vijay was attacked by some unidentified persons in the #Vijayakanth funeral place 💔#Captain #RIPVijayakanth pic.twitter.com/lmrmRr1WVR
— AK (@iam_K_A) December 29, 2023