జైలర్ విలన్ ఓవరాక్షన్
X
చాలామంది రీల్ విలన్స్.. రియల్ లైఫ్ లో హీరోలు ఉంటారు. వెండితెర ఇమేజ్ కు ఒరిజినల్ క్యారెక్టర్ కు అస్సలు సంబంధమే ఉండదు. ఒకప్పుడు చలపతిరావు, రఘువరన్, రామిరెడ్డి వంటి విలన్స్ ను చూస్తే బయట జనం జడుసుకునేవారు. కానీ వారి అసలు వ్యక్తిత్వం ఎంత గొప్పదో వారిని కలిస్తే కానీ తెలియదు. కానీ కొందరుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ అట్టాగే ప్రవర్తిస్తుంటారు. తామేదో సినిమాలు చేస్తున్నంత ఈజీగా రియల్ లైఫ్ లో రుబాబు చేస్తుంటారు. మరి ఇలాంటివి బయట వర్కవుట్ అవుతాయా.. తీసుకువెళ్లి ఏడు ఊచల వెనకేస్తారు కదా.. అలాగే అయ్యింది మన జైలర్ నటుడు వినాయకన్ కి.
అప్పుడెప్పుడో నాగార్జున, మాస్, కళ్యాణ్ రామ్ అసాధ్యుడు సినిమాల్లో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు మళయాల నటుడు వినాయకన్. అప్పుడెవరూ అతన్ని పట్టించుకోలేదు. బట్ రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. రజినీకాంత్ లాంటి హీరోకు ధీటుగా అతని పాత్ర పేలింది. దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. విశేషం ఏంటంటే.. అతను మళయాలం నుంచి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. అంటే వృత్తి పరంగా అంత గొప్ప ప్రతిభావంతుడు అనే కదా అర్థం. కానీ వ్యక్తిత్వ పరంగా అంత గొప్పగా కనిపించడు అంటారు కొందరు. కొన్నాళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోతే అతని ఊరేగింపుపై కామెంట్స్ చేసి విమర్శలు పాలయ్యాడు. తాజాగా ఓ పబ్లిక్ ప్లేస్ లో మందు తాగి నానా హంగామా చేశాడు. పోలీస్ లకు కంప్లైంట్ ఇస్తే.. వాళ్లు స్టేషన్ కు పిలిపించారు. బట్ మనోడు అక్కడ కూడా అలాగే ప్రవర్తించాడు. పోలీస్ లను కూడా నానా బూతులు తిట్టి.. స్టేషన్ అంతా నాదే అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అదేదో సినిమాలో సీన్ లాగా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. దీంతో పోలీస్ లో తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి కేస్ బుక్ చేశారు. ఎంతైనా సెలబ్రిటీ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారనుకోండి. కానీ అతను పోలీస్ స్టేషన్ లో రెండు నిమిషాలు మాట్లాడితే కేరళ ఛానల్స్ లో 20 బీప్ లు వేయాల్సి వచ్చింది. అంటే అన్ని బూతులు ఉన్నాయన్నమాట. మరి సెలబ్రిటీగా వెలుగుతూ.. ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఎలా అంటూ చూసిన జనాలంతా మనోడిపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి వినాయకన్ కు. ఇలాంటి టైమ్ లో నిజంగా ఇంకేదైనా పెద్ద ఇష్యూ చేసి జైలుకు వెళితే.. ఆయన జైలర్ సినిమా రిపీట్ అవుతుందేమో కానీ.. బయట నిర్మాతలు లాస్ అయిపోతారు. తర్వాత మనోడు ఆఫర్స్ కూడా లాస్ అవుతాడు.