Home > సినిమా > Mark Antony : సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చింది.. విశాల్ సంచనల కామెంట్స్

Mark Antony : సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చింది.. విశాల్ సంచనల కామెంట్స్

Mark Antony : సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చింది.. విశాల్ సంచనల కామెంట్స్
X

"కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు." మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ రిలీజ్‌ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ ఆఫీసులో ఈ అనుభవం ఎదురైందని చెప్పారు. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం మరో రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వీడియోలో స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదన్న ఆయన..అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, పీఎం నరేంద్ర మోడీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీడియో చేసినట్లు విశాల్ ప్రకటించారు. ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్స్‌ నెంబర్లను ఆయన పోస్ట్ చేశారు. విశాల్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెండితెరపై అవినీతిని చూపించడం మంచిదే.. కానీ నిజ జీవితంలో కాదు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్‌సీ ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉంది. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించి 2 ట్రాన్సాక్షన్లు చేశా. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. సినిమా ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉన్నందున మధ్యవర్తి మేనగాకు ఆ మొత్తం చెల్లించక తప్పలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదంతా నాకోసం చేస్తున్నదికాదు.. భవిష్యత్తు నిర్మాతల కోసం. కష్టపడి సంపాదించిన డబ్బు లంచంగా ఇవ్వాల్సిందేనా..? ఆ ప్రశ్నే లేదు. సాక్ష్యాలు ఇక్కడే పోస్ట్ చేస్తున్నా. నిజం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ విశాల్ పోస్ట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated : 28 Sept 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top