ఆ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ను కొన్న అదాశర్మ !
X
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సుశాంత్ మరణాన్ని ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటీకీ సుశాంత్ సూసైడ్ వెనకున్న మిస్టరీ రివీల్ కాలేదు. ఇదిలా ఉంటే సుశాంత్ సినిమాల్లో నటించేటప్పుడు బాంద్రాలోని మోంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవాడు. 2020లో అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన దగ్గరి నుంచి ఆ ఫ్లాట్ అలా ఖాళీగానే ఉంటోంది. ఎవరూ అద్దెకు ఉండేందుకు ముందుకు రాలేదు. అయితే ఇళ్లు కొనేందుకు మాత్రం కొంత మంది వచ్చినా ఆ ఇంటి యజమాని ఒప్పుకోలేదట. అద్దెకు ఇవ్వడానికే ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ ఉన్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి అదా శర్మ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో అదా శర్మ మౌనం వీడింది.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అదా శర్మ సుశాంత్ ఉన్న ఫ్లాట్‌ను కొన్నట్లు సమాచారం. అందుకే ఆ ఫ్లాట్‌ను చూసేందుకు అదా వచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేస్తుందన్న వార్త వైరల్ కావడంతో శనివారం మీడియా నటిని ప్రశ్నించగా అలాంటిది ఏమైనా ఉంటే ముందుగా మీకే చెబుతాని చెప్పుకొచ్చింది అదా శర్మ, ఫైనల్ అయితే త్వరలోనే మీకు స్వీట్స్ పంచిపెడతానని తెలిపింది. ఇదిలా ఉంటే కెరీర్లో పీక్స్‌కు వెళ్తున్న సమయంలో సుశాంత్ ప్రైవసీ కోసం తన ఫ్యామిలీకి దూరంగా బాంద్రాలోని ఫ్లాట్‌లో ఉండేవాడు. సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌కు నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవాడట. కేదార్నాథ్, ఎంఎస్ ధోని, చిచోరే, కాయ్ పో చే, పీకే, దిల్ బేచారా వంటి సినిమాలలో నటించి తన వైవిధ్యమైన నటనతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు సుశాంత్. తన కెరీర్‌కు, లైఫ్‌కు మధ్యంతరంగా ఫుల్ స్టాప్ పెట్టి సూసైడ్ చేసుకుని అందరినీ షాక్‌కు గురిచేశాడు సుశాత్.