Amala Paul Second Marriage : అమలా పాల్ రెండో పెళ్లి
X
నటిగా వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకుంది నటి అమలాపాల్. కొన్నాళ్ల క్రితం ప్రేమఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. ఆ తర్వాత ఇక్కడా చాలా సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో తను కోరుకున్న స్టార్డమ్ లేదు. తమిళ్ లో కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే అక్కడి దర్శకుడు విజయ్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తను నటించాలనుకుంది. అందుకు విజయ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరోవైపు అమలా, హీరో ధనుష్ మధ్య ఏదో ఉందని కోలీవుడ్ మీడియా నిత్యం ఏదోకటి రాస్తూనే ఉన్నాయి. అదే టైమ్ లో విజయ్ ఒప్పుకోకున్నా అమలా, పాల్ ధనుష్ తో ఒక సినిమాలో నటించింది. అది వీరి మధ్య విభేదాలకు కారణమైంది. అటు విజయ్ పేరెంట్స్ అమలను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కట్ చేస్తే 2014లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ 2017లో విడిపోయారు.
విడాకులు తర్వాత అమలా పాల్ కెరీర్ పై ఫోకస్ చేసింది. అటు విజయ్ కూడా పెద్దగా ఆలస్యం చేయకుండా రెండో పెళ్లి చేసుకుని దర్శకత్వంలో బిజీ అయ్యాడు. ఇన్నాళ్లూ నటన, టూర్స్ అంటూ చాలా బిజీగా ఉన్న అమలా పాల్ కూడా రెండో పెళ్లి చేసుకుంది. టూరిజమ్, హాస్పిటాలిటీ వృత్తిలో ఉన్న జగత్ దేశాయ్ ని తాజాగా కేరళలోని కొచ్చిలో పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమ గురించి చాలా కొద్ది రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అంతే తక్కువ టైమ్ లోనే పెళ్లి కూడా చేసుకుని ఒక్కటయ్యారు.
ఓ రకంగా హీరోయిన్లకు పెళ్లి తర్వాతే కెరీర్ ఉండదు.. అలాంటిది విడాకులు తర్వాత ఉంటుందా అనుకున్నవారికి అమలా పాల్ తన కెరీర్ తో సమాధానం చెప్పింది. పెళ్లి, విడాకులు అనేవి వ్యక్తిగతం. నటన అనేది వృత్తి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే మనసుకు తగిలిన గాయాలకు సరైన మందు పని చేసుకుంటూ వెళ్లడమే అనే ఫిలాసఫీ కూడా అమలా పాల్ లైఫ్ లో కనిపిస్తుంది. ఏదేమైనా మళ్లీ పెళ్లి చేసుకున్న అమలా పాల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుదాం.