Home > సినిమా > 'నీలాంటి మగాళ్లు ఈ ప్రపంచానికి అవసరం'.. అనసూయ

'నీలాంటి మగాళ్లు ఈ ప్రపంచానికి అవసరం'.. అనసూయ

నీలాంటి మగాళ్లు ఈ ప్రపంచానికి అవసరం.. అనసూయ
X

టాలీవుడ్ నటి, జబర్దస్త్ లేడీ అనసూయ.. ఈ మధ్య వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో రంగమ్మత్తగా అందరినీ అలరించిన ఈ హాట్ బ్యూటీ... తనకు వచ్చిన సినిమాల్లో బలమైన పాత్రలనే ఎంచుకుంటూ.. సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన పెదకాపు-1 సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన అక్కమ్మ రోల్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్‌ చేస్తుంది ఈ గ్లామరస్ లేడీ. ఇప్పుడు అదే చేసింది. కానీ చాలా స్పెషల్‌.

తన భర్త శుశాంక్ భరద్వాజ్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది అనసూయ. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కేక్ కట్ చేసి.. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. తన సర్వస్వం భరద్వాజే అని చెబుతూ ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసి, ఓ కామెంట్‌ కూడా పెట్టింది. `ఈ ప్రపంచానికి నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి తమ్ముడు, నీలాంటి భర్త, నీలాంటి అల్లుడు, నీలాంటి తండ్రి, ఈ ప్రపంచానికి నీ లాంటి మనుషులు కావాలి. నా విషయంలో అది నువ్వు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ధన్యవాదాలు. నన్ను నేనుగా ఉండనివ్వండి అంటూ బర్త్ డే విషెస్‌ తెలిపింది అనసూయ.

రీల్ లైఫ్‌లో హాట్‌గా, బోల్డ్‌గా కనిపించే అనసూయ..భర్త బర్త్ డే రోజు మాత్రం చాలా ఖుషిగా, వెరీ హ్యాపీ మూడ్‌లో కనిపించింది. భర్త చేయి పట్టుకొని గట్టికా హత్తుకున్న ఫోటోతో పాటు కేక్ కట్ చేసిన వీడియోని ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. హాట్ పెయిర్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా భరద్వాజ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. కొందరు నెటిజన్లు మాత్రం సార్ అదృష్టవంతుడు అని కామెంట్స్ చేస్తున్నారు.


Updated : 4 Oct 2023 7:34 AM IST
Tags:    
Next Story
Share it
Top