ఆ మూవీ అటు ఇటు అయితే అనుపమ పరిస్థితి ఇక అంతే!
X
సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ సీన్స్ చేయడానికి నో చెబుతూ వస్తోంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే క్యారెక్టర్లే చేస్తూ వస్తోంది. నటనకు స్కోప్ ఉన్న ఆ పాత్రలను చేస్తూ రావడంతో తెలుగు ఆడియన్స్ ఆమెను ఎంతో ఇష్టపడుతున్నారు. ఇక కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోయిన అనుపమ సడెన్‌గా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. టిల్లు స్క్వేర్‌తో కాస్త రొమాంటిక్‌గా కనిపించనుంది.
డీజే టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. అన్నింట్లోనూ అనుపమ హాట్ లుక్ లోనే కనిపించింది. హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి కొన్ని బోల్డ్ సీన్స్‌లో కూడా నటించింది. గ్లామర్ టచ్ పాత్రను చేస్తూ లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాకయ్యారు. సడన్‌గా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కారణం ఏంటని ఆ మధ్య అనుపమకు ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానం ఇస్తూ..సింపుల్ పాత్రలు చేసి బోర్ కొట్టిందని, అందుకే ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
మరి టిల్లు స్క్వేర్‌లో నటనకు స్కోప్ ఉంటుందా? లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలియనుంది. కెరీర్ పీక్ దశలో ఉండగా అనుపమ ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఆమెకు ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనేది ఈ వారమే తేలిపోనుంది. సినిమా అటు ఇటూ అయితే మాత్రం అనుపమ పరిస్థితి ఇక అంతేనంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.