Home > సినిమా > మూడేళ్ల గ్యాప్ వచ్చినా..ఆ విషయంలో తగ్గేదేలే

మూడేళ్ల గ్యాప్ వచ్చినా..ఆ విషయంలో తగ్గేదేలే

మూడేళ్ల గ్యాప్ వచ్చినా..ఆ విషయంలో తగ్గేదేలే
X

టాలీవుడ్‌ అగ్ర తార అనుష్క ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంటోంది. 2020లో నిశ్శబ్ధం సినిమాతో ఓటీటీలో మెరిసిన స్వీటీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి ఎంతలేదన్నా మూడేళ్లు అవుతోంది. ఈ మూడేళ్ల గ్యాప్ తర్వాత యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్‎గా నటిస్తున్న మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమా సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో అనుష్కకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమా కోసం అనుష్క తీసుకున్న రెమ్యునరేషన్‏పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

గతంలో అనుష్క ఒక్కో సినిమాకు రూ.3కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది. అయితే ఇది మూడేళ్ల క్రితం ముచ్చట. అయితే గ్యాప్ తరువాత అనుష్క తన రెమ్యునరేషన్‎ను తగ్గిస్తుందని అంతా భావించారు. కానీ, ఆమె తన రెమ్యునరేషన్‌ ను తగ్గించడం కాదు రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమాకు స్వీటీ ఏకంగా రూ.6 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజమన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఇండస్ట్రీలో ఎంత కూడబెట్టామన్నది ముఖ్యం కాదు..ఎంతమంత్రి ఫ్రెండ్స్‎ను సంపాదించుకున్నాము అన్నదే ముఖ్యం అనే మాటను నమ్ముతుంది అనుష్క. ఈ విషయంలో స్వీటీకి ఎవరూ సరిపోరు. గతంలో రెమ్యునరేషన్ విషయంలో అనుష్క మాట్లాడుతూ.. "ఒక హీరోయిన్ 100 సినిమాల్లో యాక్ట్ చేయడం , కోట్ల రూపాయలు కూడబెట్టడం, చాలా ఏళ్లు హీరోయిన్‎గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం వంటివి పెద్ద విషయాలు కావు. కానీ సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ముఖ్యం. డబ్బు సంపాదించడం కన్నా మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు రెమ్యునరేషన్ ముఖ్యం కాదు. మంచి పాత్రలో నటించాలన్నదే నా కోరిక"అని తెలిపింది.

Updated : 21 Aug 2023 3:40 PM IST
Tags:    
Next Story
Share it
Top