Home > సినిమా > నటి దివ్య స్పందన బతికే ఉన్నారు.. అసలేమైందంటే?

నటి దివ్య స్పందన బతికే ఉన్నారు.. అసలేమైందంటే?

నటి దివ్య స్పందన బతికే ఉన్నారు.. అసలేమైందంటే?
X

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో బతికున్నోళ్లూ చనిపోతున్నారు. ఎందుకంటే కొందరు తమ పోస్టులతో బతికుండగానే వాళ్లను చంపేస్తున్నారు. తాజాగా కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ దివ్య స్పందన మరణించారని సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె గుండెపోటుతో చనిపోయారని ఓ వ్యక్తి ట్వీట్‌ చేయడంతో నెట్టింట కలకలం రేగింది. దీంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. అయితే ఈ విషయంపై ఆమె సన్నిహితులు సహా కొంతమంది క్లారిటీ ఇచ్చారు.

దివ్య స్పందన బతికే ఉన్నారని ఆమె సన్నిహితులు చెప్పారు. ఆమె జెనీవాలో ఉన్నారని, ఫోన్‌చేసి మాట్లాడినట్లు కూడా వివరించారు. కొంతమంది నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై తమిళనాడు కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ ఛైర్మన్‌ కేటీ లక్ష్మీకాంతన్‌ స్పందించారు. దివ్య స్పందన మృతిపై వస్తున్నవన్నీ తప్పుడు ఊహాగానాలేనని స్పష్టంచేశారు. ఆమె బాగానే ఉన్నారంటూ చెప్పారు.

కన్నడ నటుడు విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన ఇటీవలే మరణించారు. ఆమెను గుర్తుచేసుకుంటూ ఆయన ఓ పోస్ట్‌ పెట్టగా.. కొందరు నెటిజన్లు ఆమె పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ పెడుతూ సంతాపం తెలిపారు. అది చూసిన ఓ వ్యక్తి నటి దివ్య స్పందన అనుకుని పొరబడి ఆమెను ట్యాగ్‌ చేస్తూ చనిపోయారని పోస్టు పెట్టారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కల్యాణ్‌రామ్‌ సరసన ‘అభిమన్యు’ సనిమాలో నటించారు. 2013లో మాండ్యా ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపున పోటీచేసి గెలిపొందారు. ఆ తర్వాత 2014లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Updated : 6 Sept 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top