Home > సినిమా > తొమ్మిదో నెల కడుపుతో చాలా అలసిపోతున్నా.. ఇలియానా

తొమ్మిదో నెల కడుపుతో చాలా అలసిపోతున్నా.. ఇలియానా

తొమ్మిదో నెల కడుపుతో చాలా అలసిపోతున్నా.. ఇలియానా
X

మత్తెక్కించే సన్నని అందాలతో కుర్రాళ్లను కిర్రెక్కించిన గోవా భామ ఇలియానా డిక్రూజ్ నిజ జీవితంలోనూ డేర్ డెవిలే. పెళ్లి కాకుండా తల్లి అవుతున్న ఆమె ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా తన ప్రెగ్నన్సీ విషయాలను బోల్డ్‌గా చెప్పేస్తోంది. తన బిడ్డకు తండ్రి అంటూ ఓ వ్యక్తిని మసక మసకగా చూపిన ఈ సుందరి రేపోమాపో బిడ్డకు జన్మనివ్వనుంది. తనకిప్పుడు తొమ్మిదో నెల ఇలియానా సోషల్ మీడియాలో చెప్పింది.

‘‘తొమ్మిదో నెల కావడంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. నీరసంతో బాధపడుతున్నాను. నడవడం కూడా కష్టంగానే ఉంది. మాతృత్వం గొప్పదిని చెబుతారు. లోపల నా బిడ్డ తంతోంది" అని రాసుకొచ్చింది. డెలివరీ సుఖంగా సాగాలని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొన్ని లవ్ ఎఫైర్లు బెడిసికొట్టిన తర్వాత ఇలియానా స్థిరమైన బంధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రియుడి వివరాలు ఇంతవరకు బయటపెట్టని ఇలియానా బిడ్డ పుట్టాకైనా చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె గర్భం ధరించకముందు వరకు కొన్ని వెబ్ సిరీస్‌లు చేసింది. ‘దేవదాస్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా టాప్ హీరోలతో నటించి మంచి హిట్లు ఇచ్చింది.


Updated : 9 July 2023 8:20 PM IST
Tags:    
Next Story
Share it
Top